: పుష్కర ఘాట్లలో తాజా పరిస్థితిపై గంటకో బులెటిన్ విడుదల... చంద్రబాబు ప్రకటన


గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చెప్పారు. పుష్కరాలపై పలువురు మంత్రులు, కీలక శాఖల అధికారులతో రాజమండ్రిలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన ఆయన కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. పుష్కర ఘాట్లలోని తాజా పరిస్థితులను భక్తులకు చేరవేసేందుకు ప్రతి గంటకు ఓ బులెటిన్ విడుదల చేస్తామన్నారు. ఇందుకోసం ఘాట్లలో విధుల్లో ఉన్న సిబ్బందికి ట్యాబ్ లను అందజేశామని తెలిపారు. ఇక పుష్కర స్నానాల కోసం తరలివస్తున్న భక్తులు కూడా క్రమశిక్షణతో మెలగాలని ఆయన పిలుపునిచ్చారు. జీపీఎస్ ద్వారా బస్సుల రాకపోకలను నియంత్రిస్తున్నామని చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News