: చెన్నై మెట్రో రైలులో హీరోయిన్ త్రిష ప్రయాణం


చెన్నయ్ లో మెట్రో రైల్ అనుభూతిని సొంతం చేసుకోవడానికి ప్రముఖులు కూడా ఇటీవల సరదాగా ఈ రైలు ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ త్రిష కృష్ణన్ కూడా తాజాగా మెట్రో రైలులో ప్రయాణించింది. మెట్రో ప్రయాణంలో చెన్నై సిటీ అందాలను ఆస్వాదించింది. ఆరుమ్బాకం స్టేషన్ లో స్వయంగా టికెట్ తీసుకుని కోయంబేడు వరకు ప్రయాణించింది. అందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. తాను కాలేజ్ కు వెళ్లే సమయంలో సొంత వాహనం ఉండటంతో ఎప్పుడూ లోకల్ ట్రైన్ లో ప్రయాణించలేదని చెప్పింది. ఆ వెంటనే సినిమాల్లోకి రావడంతో అసలా ఆలోచనే రాలేదని, కానీ ఇప్పుడు సిటీలో మెట్రో రైలు వచ్చినందుకు చాలా ఎగ్జయిటింగ్ గా వుందని తెలిపింది.

  • Loading...

More Telugu News