: దివంగత ఎన్టీఆర్ కు గోదావరి పుష్కరాల్లో పిండ ప్రదానం
తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావుకు గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని పిండప్రదానం జరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు సభ్యుడు, హస్తకళలు, వికలాంగుల సంస్థ మాజీ చైర్మన్ సాయిబాబా ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ చిత్రపటాన్ని ముందుంచుకుని సాయిబాబా పిండప్రదానం కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కాని, టీడీపీ నేతలు కాని హాజరుకాలేదు.