: గోదావరి పుష్కరాల్లో మరో ప్రమాదం... భక్తులపైకి దూసుకెళ్లిన వాటర్ ట్యాంకర్


పవిత్ర గోదావరి పుష్కరాల్లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. పుష్కరాల తొలి రోజునే ఏపీలోని రాజమండ్రిలో జరిగిన ప్రమాదంలో 27 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా నేటి ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలో మరో ప్రమాదం చోటుచేసుంది. పుష్కరాల కోసం వచ్చిన భక్తులపైకి వాటర్ ట్యాంకర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ ట్రాక్టర్ టైర్ల కింద చిక్కుకుపోగా, పలువురు భక్తులకు గాయాలయ్యాయి. అయితే వెనువెంటనే స్పందించిన పోలీసులు టైర్ల కింద చిక్కుకున్న మహిళతో పాటు గాయపడ్డవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News