: 'షుగర్' మందులతో క్యాన్సర్ కు అడ్డుకట్ట!
ప్రపంచంలో క్యాన్సర్ మహమ్మారి కారణంగా ఎంతోమంది ప్రాణాలు విడుస్తున్నారు. మనిషి శరీరంలో మంచి కణాలను కబళించివేసే ఈ క్యాన్సర్ ఆధునిక కాలంలోనూ ప్రమాదఘంటికలు మోగిస్తోంది. కాగా, క్యాన్సర్ ను షుగర్ వ్యాధికి వాడే మందులు అడ్డుకుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. దీనిపై యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించారు. డయాబెటిస్ కు వాడే మందులు క్యాన్సర్ ట్యూమర్ల పెరుగుదలను నిరోధిస్తాయని గుర్తించారు. క్యాన్సర్ కణాల విస్తరణకు శరీరంలోని గ్లూకోజే కారణమని, ఆ కణాల పెరుగుదలకు అధికమొత్తంలో గ్లూకోజ్ అవసరమవుతుందని వారు తెలుసుకున్నారు. షుగర్ వ్యాధికి వాడే మందుల కారణంగా గ్లూకోజ్ స్థాయి స్థిరంగా ఉంటుందని, తద్వారా అధిక మొత్తంలో గ్లూకోజ్ లభించక క్యాన్సర్ కణాల ఎదుగుదల మందగిస్తుందని పరిశోధకులు వివరించారు. అంతేగాకుండా, గ్లూకోజ్ విడుదల ప్రక్రియను పరిశీలించడం ద్వారా క్యాన్సర్ ను ముందుగానే పసిగట్టవచ్చని తెలిపారు.