: ఈ నెల 21 నుంచి అనంతపురం జిల్లాలో జగన్ రైతు భరోసా యాత్ర


వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి మూడవసారి రైతు భరోసా యాత్రకు సమాయత్తమవుతున్నారు. ఈ నెల 21 నుంచి అనంతపురం జిల్లాలో యాత్ర చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో జగన్ రైతు భరోసా యాత్ర చేస్తారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను జగన్ పరామర్శించనున్నారు. ఈ మేరకు పార్టీ ఎంపీలతో ఈరోజు జరిపిన భేటీలో యాత్ర షెడ్యూల్ ను ఖరారు చేశారు. యాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలను పార్టీ వర్గాలు వెల్లడించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News