: పుష్కరాల్లో ఐఫోన్ చోరీ... రాజమండ్రిలో దొంగల హల్ చల్!
పవిత్ర గోదావరి పుష్కరాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రధానంగా ఏపీలోని రాజమండ్రిలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లు రాత్రి, పగలన్న తేడా లేకుండా నిత్యం రద్దీతో కిటకిటలాడుతున్నాయి. దీనినే అవకాశంగా తీసుకున్న దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. భక్తుల ముసుగులో జనంలో కలిసిపోయిన ఓ దొంగల ముఠా వరుస చోరీలకు పాల్పడుతోందట. ఇప్పటికే రూ.20 వేల నగదు, రెండు బంగారు గొలుసులతో పాటు ఖరీదైన ఐఫోన్ చోరీకి గురైందని భక్తుల నుంచి పోలీసులకు ఫిర్యాదులందాయి. అయితే ఫిర్యాదులపై పోలీసులు అంతగా స్పందించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు.