: వివేక్ ఒబెరాయ్ తో టీఎస్ మంత్రి కేటీఆర్ భేటీ!
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) నిన్న ముంబైలో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహించిన ఆయన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ని కూడా కలిశారు. చలన చిత్ర నిర్మాణానికి సంబంధించి హైదరాబాదులోని అనుకూలాంశాలను ఆయన ఒబెరాయ్ కి వివరించారు. వినోద రంగానికి తాము పెద్ద పీట వేస్తున్నామని కూడా కేటీఆర్ చెప్పారు. ముంబైలో కొనసాగిస్తున్న కార్యకలాపాలను హైదరాబాదుకు విస్తరించాలని ఈ సందర్భంగా ఆయన ఒబెరాయ్ ని కోరారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.