: పాక్ కు షాకిచ్చిన ఐసీసీ!... ఆఫ్ స్పిన్నర్ హఫీజ్ బౌలింగ్ పై ఏడాది నిషేధం


పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మరోమారు షాకిచ్చింది. ఆ జట్టుకు ఆఫ్ స్పిన్నర్ గానే కాక ఆల్ రౌండర్ గానూ వ్యవహరిస్తున్న మహ్మద్ హఫీజ్ బౌలింగ్ పై ఏడాది పాటు నిషేధం విధించింది. ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తున్న పాక్ జట్టుకు ఐసీసీ నిర్ణయం శరాఘాతమనే చెప్పాలి. ఇప్పటికే గతంలో ఓ సారి ఐసీసీ నిషేధాన్ని ఎదుర్కొన్న హఫీజ్ పై మరోమారు నిషేధం అమలవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బేనని చెప్పొచ్చు. లంకతో గాలెలో జరిగిన టెస్టు మ్యాచ్ లో హఫీజ్ బౌలింగ్ పై అనుమానం వ్యక్తం చేసిన అంపైర్లు ఐసీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఐసీసీ ఆదేశాల మేరకు హఫీజ్ చెన్నైలోని శ్రీరామచంద్ర వర్సిటీలో జరిగిన పరీక్షకు హాజరయ్యాడు. పరీక్షలో హఫీజ్ బౌలింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలింది. దీంతో అతడి బౌలింగ్ పై ఏడాది పాటు నిషేధాన్ని విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.

  • Loading...

More Telugu News