: సల్లూ భాయ్... నీ సినిమా సూపర్!: రానా


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా సినిమా 'భజరంగీ భాయ్ జాన్' సినిమా అద్భుతంగా ఉందని టాలీవుడ్ యువ నటుడు, 'భల్లాలదేవ' రానా తెలిపాడు. సినిమాలో సల్మాన్ నట విశ్వరూపం ప్రదర్శించాడని రానా ట్విట్టర్లో కీర్తించాడు. ఈద్ సందర్భంగా తన అభిమానులకు సల్మాన్ పసందైన కానుక అందించాడని రానా పేర్కొన్నాడు. ఈ సినిమాకు 'అవుట్ స్టాండింగ్' అన్న పదమే సరైన ప్రశంస అని రానా అభిప్రాయపడ్డాడు. కాగా, 'బాహుబలి' సినిమా చూసిన సల్మాన్ ఖాన్ కూడా రానా నటనను ఆకాశానికెత్తేశాడు. రానా తన స్నేహితుడు సురేష్ బాబు కుమారుడని, చిన్నప్పటి నుంచి తనకు తెలుసని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, 'భజరంగీ భాయ్ జాన్' సినిమా విజయవంతం కావాలని వెంకటేష్ ట్వీట్ చేశాడు. సల్మాన్, వెంకీ ఇద్దరూ స్నేహితులన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News