: ఐపీఎల్ లో 'ఒకే ఒక్కడు'


ఐపీఎల్ పరంపరలో తాజా సీజన్ ఆరవది అన్న సంగతి తెలిసిందే. తొలి సీజన్ నుంచి నేటి వరకు పాకిస్తాన్ జాతీయ క్రికెటర్లకు ఇక్కడ నో ఎంట్రీ. కారణాలు సుస్పష్టం. పొరుగు దేశంతో బలహీన రాజకీయ సంబంధాలు, భద్రత సమస్యలతో ఇరు దేశాల క్రికెట్ బంధం బీటలు వారింది. ఆ ప్రభావం కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ పైనా పడింది. ఈ జనరంజక టోర్నీ ద్వారా అనామక క్రికెటర్లు సైతం కోట్లు కొల్లగొడుతుంటే, పాపం.. పాక్ క్రికెటర్లు నిరాదరణకు గురయ్యారు.

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. ఐపీఎల్ లో పాక్ క్రికెటర్ల ప్రవేశానికి ససేమిరా అంటోంది. వారిపై ఫిక్సింగ్ ఆరోపణలు ఎక్కువగా ఉండడమూ తోసిపుచ్చలేని కారణమైంది. అయితే, దాయాది ఆటగాళ్ళకు నో చెబుతున్న బీసీసీఐ.. అంపైర్లకు, కోచ్ లకు మాత్రం ద్వారాలు తెరిచింది. అలీమ్ దార్, అసద్ రవూఫ్ లు ఐపీఎల్ లో అంపైర్లుగా విధుల్లో ఉండగా.. రివర్స్ స్వింగ్ టెక్నిక్ కు ఆద్యుడు వకార్ యూనిస్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఒకే ఒక్క పాక్ ఆటగాడు మాత్రం ఐపీఎల్-6లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఆడుతున్న అజర్ మహమూదే ఆ 'ఒకే ఒక్కడు'. అజర్ గతంలో పాకిస్తాన్ జట్టుకు పలు టెస్టుల్లో, వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. అయితే, అజర్ 2011లో బ్రిటీష్ పౌరసత్వం స్వీకరించాడు. దీంతో, అజర్ ను బ్రిటీష్ పౌరుడిగానే ఐపీఎల్ లోకి అనుమతించారు.

  • Loading...

More Telugu News