: నేపాల్ క్రికెట్ జట్టు ఫిజియో పాడుబుద్ధి!


ఐసీసీ టి20 వరల్డ్ కప్ కు అర్హత పొందేందుకు గాను ఐర్లాండ్ లో క్వాలిఫయింగ్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. ఈ అర్హత పోటీల్లో నేపాల్ జట్టు కూడా ఆడుతోంది. అయితే, నేపాల్ జట్టు ఫిజియో డాక్టర్ ఐజాజ్ బషీర్ అశాయ్ పై లైంగిక దాడి ఆరోపణలు వచ్చాయి. నేపాల్ జట్టు బస చేసిన హోటల్లో మసాజ్ చేసే యువతిని కాముకత్వంతో తాకాడని అభియోగాలు మోపారు. ఐజాజ్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న నేపాల్ క్రికెట్ సంఘం వెంటనే ఆ ఫిజియోతో కాంట్రాక్టును రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఓ పోలీసు కానిస్టేబుల్ తెలిపిన వివరాల ప్రకారం... స్టార్మోంట్ లో ప్రస్తుతం మ్యాచ్ లు జరుగుతుండగా, జట్టు అక్కడి లా మోన్ హోటల్లో బస చేసింది. ఈ సందర్భంగా, తనకు బాడీ మసాజ్ చేయాలని సదరు యువతిని కోరాడా కీచక ఫిజియో. అండర్ ప్యాంట్స్ తో మసాజ్ టేబుల్ పైకి రావాలని అక్కడి సిబ్బంది సూచించినా, అవేమీ లేకుండానే మసాజ్ కు సిద్ధమయ్యాడు. ఆ యువతి మసాజ్ చేస్తుండగా ఆమె చేతులను గట్టిగా పట్టుకుని తన కాళ్ల మధ్య ఉంచుకున్నాడట. ఘటనపై ఫిజియో తరపు న్యాయవాది భిన్న కథనం వినిపిస్తున్నారు. తన క్లయింటు మసాజ్ చేయించుకున్నది నిజమేనని, కానీ, ఆమె చేతులు పట్టుకున్నాడన్నది అవాస్తమని అన్నారు. అన్నట్టు... సదరు ఫిజియో భారత్ కు చెందినవాడే.

  • Loading...

More Telugu News