: మరో నెలన్నర రోజుల్లో ప్రత్యేక హోదా వస్తుందంటున్న సుజనా
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం విజయవాడలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సుజనా కూడా హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మరో నెలన్నర రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తథ్యమని అన్నారు. ఇక, హైదరాబాదులో సెక్షన్-8 అమలుపై కేంద్రానికి మరోసారి విన్నవించుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాజధాని నిర్మాణానికి, మెట్రోరైలు వ్యవస్థకు నిధులు, స్పెషల్ రైల్వే జోన్ కేటాయింపు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలనుకుంటున్నామని చెప్పారు.