: ధోనీకి జార్ఖండ్ ముఖ్యమంత్రి మద్దతు
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ మద్దతు పలికారు. రాంచీలోని తన నివాసంలో ధోనీతో అరగంట సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ నాయకుడిగా జీవితంలో ఎత్తుపల్లాలు తెలుసని అన్నారు. రాజకీయ నాయకుల్లానే క్రీడాకారుల కెరీర్ లో కూడా ఎత్తుపల్లాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి ఎన్నికల్లో తామెలా విజయం సాధించలేమో, అలాగే క్రీడాకారులు కూడా ప్రతి మ్యాచ్ లోను విజయం సాధించలేరని అన్నారు. కాగా, గతంలో జార్ఖండ్ లో క్రికెట్ అకాడెమీ ప్రారంభించేందుకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ధోనీ సీఎంను కోరారు. తాజా సమావేశం అనంతరం ధోనీ మాట్లాడుతూ, తొలిసారి సీఎంను కలిశానని, అకాడెమీ విషయం ఏమవుతుందో చూడాలని అన్నాడు.