: చిన్నారులకు భద్రత కల్పించలేకపోతే ఏ సిటీ కూడా 'స్మార్ట్' అనిపించుకోదు: కేంద్రం


దేశంలో బాలల భద్రతపై ప్రజా సంఘాలు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాల సంఖ్య నానాటికీ పెరుగుతుండడం అటు కేంద్రాన్ని కూడా కలవరపరుస్తోంది. దీనిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. బాలలకు భద్రత కల్పించకపోతే ఏ నగరం కూడా స్మార్ట్ సిటీ అనిపించుకోదని అభిప్రాయపడ్డారు. చిన్నారులకు సురక్షితమైన భవిష్యత్తుపై భరోసా కల్పించినప్పుడే స్మార్ట్ సిటీ ప్రాజెక్టు విజయవంతమవుతుందని అన్నారు. బాలలపై దేశంలో చోటుచేసుకుంటున్న లైంగిక వేధింపులకు సంబంధించిన గణాంకాలు బాధ కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. పలు ప్రభుత్వాల ద్వారా బాలల రక్షణకు ఎన్నో చట్టాలు వచ్చినా, జరుగుతున్న దారుణ ఘటనలు ఆ చట్టాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News