: ఓవర్ కి 8 చొప్పున కొడుతున్న భారత్... 98/2


తొలి టీట్వంటిలో టీమిండియా ఆటగాళ్లు ఆకట్టుకుంటున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. మురళీ విజయ్ దూకుడుగా ఆడితే, కెప్టెన్ రహానే సంయమనంతో ఆడాడు. దీంతో 5.2 ఓవర్లలో టీమిండియా తొలి అర్ధ సెంచరీ పూర్తి చేసింది. వెంటనే మురళీ విజయ్(34) అవుటయ్యాడు. అనంతరం ఊతప్పతో జత కలిసిన రహానే (33) ఇన్నింగ్స్ ను కొనసాగించాడు. దూకుడు పెంచే క్రమంలో రహానే వెనుదిరిగాడు. దీంతో 12 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఓవర్ కి ఎనిమిది పరుగుల చొప్పున 98పరుగులు చేసి, రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఊతప్ప (15), మనీష్ పాండే (14) ఆడుతున్నారు.

  • Loading...

More Telugu News