: పార్టీ ఎంపీలతో బాబు సమావేశం...చర్చోపచర్చలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలతో విజయవాడలోని గేట్ వే హోటల్ లో సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన ఎంపీలతో చర్చిస్తున్నారు. ప్రత్యేక హోదాపై రోజురోజుకూ పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో పార్లమెంటులో పార్టీ వ్యూహం, రాజధాని, పోలవరం, స్మార్ట్ సిటీలు, విమానాశ్రయాల ఏర్పాటుకు అవసరమైన నిధులు రాబట్టేందుకు చేపట్టాల్సిన ప్రణాళికలపై ఎంపీలతో బాబు చర్చిస్తున్నారు. పుష్కర ఏర్పాట్ల పర్యవేక్షణలో తలమునకలైన చంద్రబాబు మధ్యాహ్నం విజయవాడ చేరుకున్నారు.