: గోదావరి పుష్కరాల్లో బాహుబలి సీన్!
ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా 'బాహుబలి' గురించే! ఇటీవలే విడుదలై వరుసబెట్టి రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్న ఈ భారీ బడ్జెట్ జానపద చిత్రం భారత సినీ చరిత్రలో అద్భుతం అంటున్నారు ఫిలిం క్రిటిక్స్. కాగా, ఈ సినిమా విషయానికొస్తే... శివగామి పాత్రధారి రమ్యకృష్ణ చేతిలో శిశువును పైకెత్తి పట్టుకుని తాను నీట మునిగి పరవళ్లెత్తే ప్రవాహాన్ని దాటడం కనిపిస్తుంది. ఇప్పుడలాంటి సన్నివేశమే రాజమండ్రి పుష్కరాల్లో కనిపించింది. ఓ వ్యక్తి శిశువును సరిగ్గా బాహుబలి తరహాలోనే పైకెత్తడం మీడియా కంటపడింది. ఈ దృశ్యాన్ని మీడియా కెమెరాలు క్లిక్ మనిపించాయి. సోషల్ మీడియాలోనూ ఈ ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి.