: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
జింబాబ్వేలో జరుగుతున్న తొలి టీట్వంటీ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్, రెట్టించిన ఉత్సాహంతో టీట్వంటీ సిరీస్ ను కూడా దక్కించుకోవాలని చూస్తోంది. వన్డే సిరీస్ లో టీమిండియాకు దీటైన పోటీ ఇచ్చిన జింబాబ్వే జట్టు, టీట్వంటీ సిరీస్ ను గెలుచుకుని పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. కాగా, టీట్వంటీ సిరీస్ లో భాగంగా ఇరు జట్లు రెండు మ్యాచ్ లలో తలపడనున్నాయి.