: పాక్ స్పిన్నర్ మహ్మద్ హఫీజ్ పై నిషేధం
నిబంధనలను అతిక్రమించి బౌలింగ్ చేసిన ఆరోపణలపై మరో పాకిస్థాన్ బౌలర్ పై వేటు పడింది. పాక్ స్పిన్నర్ మహ్మద్ హఫీజ్ పై ఏడాది కాలం పాటు నిషేధం విధిస్తున్నట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టులో ఆడిన సమయంలో హఫీజ్ బౌలింగ్ యాక్షన్ పై అనుమానాలు వచ్చాయి. అంపైర్ల ఫిర్యాదు మేరకు ఐసీసీ విచారణకు ఆదేశించింది. విచారణలో అతని బౌలింగ్ శైలి నిబంధనలను అతిక్రమిస్తున్నట్టు తేలడంతో ఈ మేరకు నిషేధం విధిస్తున్నట్టు ఐసీసీ అధికారిక ప్రకటనలో తెలియజేసింది.