: దొంగతనంగా బిస్కెట్లు తినేసి దర్జాగా వెళ్లిపోయింది!
బేకరీలో తయారు చేసిన బిస్కెట్లు కనపడడం లేదు. బిస్కెట్లు ఏమయ్యాయో అర్థం కాని బేకరీ యజమాని అది ఎవరో దొంగల పని అని భావించాడు. అయితే, షాపు బయట ఏదో జంతువు అడుగులు కనిపించడంతో సీసీ పుటేజ్ చెక్ చేసి షాక్ తిన్నాడు. ఆ వివరాల్లోకి వెళితే, అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలోని ఓ బిస్కెట్ల ఫ్యాక్టరీలో సిబ్బంది బిస్కెట్లు తయారు చేస్తున్నారు. బేక్ చేసిన బిస్కెట్లను ఓ వైపు పెడుతున్నారు. ఇలా బేక్ చేసిన బిస్కెట్లు అలా అకస్మాత్తుగా మాయమయ్యాయి. దీంతో ఇవి ఏమయ్యాయా? అంటూ వెతికిన యజమానికి ఫ్యాక్టరీకి అనుకుని ఉన్న షాపు బయట ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. దీంతో అనుమానంతో ఆయన సీసీ కెమేరా పుటేజ్ చెక్ చేయగా, ఓ ఎలుగుబంటి లోపలికి వచ్చి 40కి పైగా బిస్కెట్లను తినేసి, ఇంకొన్నింటిని తీసుకుని దర్జాగా వెళ్లిపోయింది. ఎలుగు బంటి వచ్చినప్పుడు ఎలాంటి అలికిడి లేకపోవడంతో తమకు ఎలాంటి అనుమానం రాలేదని ఆయన పేర్కొన్నాడు.