: టాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నాయి కానీ, బాలీవుడ్ సినిమాల్లోనే నటిస్తా: సునీల్ శెట్టి కుమార్తె
టాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నా బాలీవుడ్ సినిమాల్లోనే నటిస్తానని ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అథయా శెట్టి తెలిపింది. 'హీరో' సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం చేయనున్న అథయా, దక్షిణాది సినిమా రంగంపై ఆసక్తి లేదని స్పష్టం చేసింది. జియాఖాన్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు సూరజ్ పంచోలీ, అథయా ప్రధాన పాత్రల్లో 'హీరో' సినిమాను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నిర్మించాడు. నటన పరంగా తన తండ్రి సునీల్ శెట్టి నుంచి ఎలాంటి సలహాలు తీసుకోలేదని అథయా తెలిపింది. చిన్ననాటి నుంచి తన తండ్రి సినిమాలు చూస్తూ పెరిగానని, అందుకే సినిమాల్లో నటించాలన్న కోరిక కలిగిందని చెప్పింది. తన నటనా ప్రతిభను ప్రేక్షకులే నిర్ణయించాలని ఆమె తెలిపింది.