: విశాఖ మొబైల్ షాపుల్లో 'బాహుబలి' పైరసీ... ఆరుగురు అరెస్టు


'బాహుబలి' చిత్రం పైరసీ నియంత్రణలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ పైరసీ జరుగుతోందని తెలిసినా వెంటనే పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. తాజాగా విశాఖలోని డాబాగార్డెన్స్ లో ఉన్న మొబైల్ షాపుల్లో పైరసీలు చేస్తున్నట్టు సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. ఏసీపీ చిట్టిబాబు నేతృత్వంలో జరిపిన తనిఖీల్లో, కంప్యూటర్ల ద్వారా మొబైల్ ఫోన్ లోని మెమొరీకార్డుల్లో 'బాహుబలి' పైరసీ చిత్రాన్ని లోడ్ చేస్తున్నట్టు గుర్తించారు. వెంటనే ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆరు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News