: చంద్రబాబు రాజీనామా చేస్తారో లేదో చెప్పాలి: బొత్స
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తొక్కిసలాట ఘటనకు నైతిక బాధ్యత వహించి సీఎం చంద్రబాబు రాజీనామా చేస్తారో లేదో చెప్పాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. తొక్కిసలాట ఘటనపై వాస్తవాలు కప్పిపుచ్చే ప్రయత్నం తగదని ఆయన సూచించారు. వీఐపీ పుష్కర ఘాట్ కు కాకుండా సాధారణ పుష్కర ఘాట్ కు బాబు ఎందుకొచ్చారని ప్రశ్నించారు. అసలు పుష్కర ఘాట్ లో డాక్యుమెంటరీ షూటింగ్ చేసిన టీవీ యూనిట్ పై కేసు పెట్టాలన్నారు. పుష్కర నిధుల ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.