: మోదీ సర్కారుపై టీఆర్ఎస్ ఎంపీ కవిత విమర్శలు...తెలంగాణపై సవతి తల్లి ప్రేమేనని ఆరోపణ


కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంపై ఆది నుంచి నరేంద్ర మోదీ సర్కారు సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని నిజామాబాదు ఎంపీ, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆమె మీడియాతో మాట్లాడారు. మోదీ సర్కారుకు తాము వ్యతిరేకం కాదని ఆమె పేర్కొన్నారు. అలాగని అనుకూలం కూడా కాదని, ప్రభుత్వంపై తటస్థ వైఖరితోనే ముందుకు సాగుతామని అన్నారు. గోదావరి పుష్కరాలకు నిధుల కేటాయింపులోనూ కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపిందని ఆమె ఆరోపించారు. కేంద్రం వైఖరిని రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఎండగడతామని ఆమె చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కేంద్రంపై కోర్టుకెళతామని హెచ్చరించారు. ఉమ్మడి హైకోర్టులో తెలంగాణకు న్యాయం జరిగే పరిస్థితులు కూడా లేవని ఆమె వాపోయారు.

  • Loading...

More Telugu News