: గోదావరి అంటే గంగ మాదిరి కాదు!: చంద్రబాబు
లక్షలాది మంది భక్తులు ఒకేసారి స్నానాలు చేసినప్పటికీ, గోదావరి నది పరిశుభ్రంగానే ఉందని, భవిష్యత్తులోనూ నదిని అలాగే ఉంచుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. జీవనదుల్లోకెల్లా గోదావరి అత్యుత్తమమైనదని అభివర్ణించిన ఆయన, గంగ తదితర నదుల్లాగా గోదావరి కలుషితం కాలేదని అన్నారు. గోదావరిలోని పరిశుభ్ర నీరు లక్షలాది ఎకరాల సాగుకు ఉపయోగపడుతోందని, ఈ నది తమ జీవనాధారమని, గోదారమ్మ తల్లి తమకు మరింత శ్రేయస్సునందించాలని ప్రార్థిస్తున్నామని అన్నారు. కాగా, గంగానదితో పాటే గోదావరినీ పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అనగా, చంద్రబాబు ఇలా స్పందించడం గమనార్హం.