: 'బేటీ బచావో, బేటీ పడావో' ప్రచారకర్తగా పరిణీతి చోప్రా


హర్యానా ప్రభుత్వం చేపట్టిన 'బేటీ బచావో, బేటీ పడావో' ప్రచారకర్తగా బాలీవుడ్ కథానాయిక పరిణీతి చోప్రా ఎంపికైంది. ఆడపిల్లల శాతం తక్కువగా ఉన్న తమ రాష్ట్రంలో ఆ శాతాన్ని మరింత పెంచాలని ఆ రాష్ట్రం నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తమ రాష్ట్రంలో మరింత విస్తరించాలనుకుంటోంది. ఇందులో భాగంగానే హర్యానాలోని అంబాలా ప్రాంతానికి చెందిన పరిణీతిని ప్రచారకర్తగా నియమించారు. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఆమె జాతీయ అవార్డును కూడా పొందారు. ఈ నెల 21న గుర్గావ్ నిర్వహించనున్న 'బేటీ బచావో, బేటీ పడావో' పథక ప్రచార కార్యక్రమంలో పరిణీతి పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పిస్తారు.

  • Loading...

More Telugu News