: ఆ వివరాలిస్తే... కేసులు పెడతామన్నారు: ‘ఫోన్ ట్యాపింగ్’పై కోర్టుకు సర్వీస్ ప్రొవైడర్ల ఫిర్యాదు
ఓటుకు నోటు కేసు దరిమిలా తెరపైకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు కొద్దిసేపటి క్రితం ఆసక్తికరవాదనను వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ బాధ్యతలు చేపట్టిన ఏపీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణకు హాజరైన సర్వీస్ ప్రొవైడర్లు పోలీసులు అడిగిన మేరకు సమాచారం ఇవ్వలేమని తేల్చిచెప్పారు. దీనిపై సిట్ కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం విజయవాడ కోర్టులో జరుగుతున్న ఈ విచారణకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు హాజరయ్యారు. ‘ఏపీ అడిగిన సమాచారం ఇస్తే, మీపై కేసులు నమోదు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం బెదిరించింది’’ అని వారు కోర్టుకు తెలిపారు. అంతేకాక, ఇదే తరహాలో కేంద్రం కూడా తమను ఆదేశించిందని కూడా వారు చెప్పారు.