: పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవం: జానారెడ్డి
త్వరలో తాను పార్టీ మారబోతున్నట్టు వస్తున్న వార్తలను తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఖండించారు. ఆ వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రచారాలు చేసేవారు వారి విశ్వసనీయత కోల్పోతారని జానా అభిప్రాయపడ్డారు. పార్టీ మార్పు వార్తల నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ వెళ్లిన జానాను పార్టీలో ఉంటారా? లేక వెళ్లిపోతున్నారా? అని రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించారట. ఈ నేపథ్యంలోనే ఆయన బహిరంగంగా పార్టీ మార్పుపై ఇలా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ స్పష్టతతో టీ.కాంగ్రెస్ నేతల్లో ఇప్పటివరకున్న సందేహాలు పంటాపంచలయ్యాయని అనుకోవచ్చు. అంతేగాక ఈరోజు పార్టీ ధర్నాలో జానా కూడా పాల్గొనడంతో అనుమానాలు తీరిపోయాయి.