: మునిసిపల్ కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట... విజయవాడలో ఉద్రిక్తత
వేతనాల పెంపు, సర్వీసు క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లతో కొనసాగుతున్న మునిసిపల్ కార్మికుల సమ్మె కొద్దిసేపటి క్రితం విజయవాడలో ఉద్రిక్తతకు దారి తీసింది. డిమాండ్ల సాధన కోసం భారీ ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు విజయవాడలో కొత్తగా ఏర్పాటైన సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించే యత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కార్మికులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తమను అడ్డుకున్న పోలీసులపై కార్మికులు కూడా తిరగబడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువర్గాలు ఒకరినొకరు తోసేసుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాటలో అటు కార్మికులకే కాక పలువురు పోలీసులకు కూడా గాయాలైనట్లు సమాచారం.