: ఈ సవతి తల్లి ప్రేమేంటి?: కేసీఆర్ పై విరుచుకుపడ్డ నారాయణ
మునిసిపల్ కార్మికులకు న్యాయం చేసే విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని సీపీఐ నేత కె.నారాయణ నిప్పులు చెరిగారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కార్మికులకు వేతనాలు పెంచిన ఆయన, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మునిసిపల్ కార్మికుల నిరసనలకు మద్దతుగా నారాయణ ఆధ్వర్యంలో హైదరాబాదులోని నారాయణగూడలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, తాము కార్మిక లోకానికి అండగా నిలుస్తామని, వారి డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు.