: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేపై కాల్పులు
ఢిల్లీలోని బవానా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే వేద ప్రకాశ్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. గత అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇక్కడి ఈశ్వర్ కాలనీలోని తన కార్యాలయం వెలుపల ఉన్న వేద ప్రకాష్ పై దుండగులు కాల్పులు జరిపారని వివరించారు. కేసును నమోదు చేసిన పోలీసులు వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.