: చిల్లర రాజకీయాలు వద్దు... టీ కాంగ్ ధర్నాపై తలసాని ఫైర్


మునిసిపల్ కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు మద్దతుగా టీ కాంగ్రెస్ చేపట్టిన ధర్నాపై తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏ సీఎం కూడా ఇవ్వని రీతిలో కేసీఆర్ మునిసిపల్ కార్మికులకు వేతనాలను పెంచారని ఆయన పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు ఎందుకు ధర్నాకు దిగారో కూడా వారికే తెలియనట్టుగా ఉందన్నారు. చిల్లర రాజకీయాలు కట్టిపెట్టి వాస్తవాలను గుర్తించాలని ఆయన కోరారు. దేశాన్ని దిగమింగిన కాంగ్రెస్ పార్టీ, ఏనాడైనా పేదల పక్షాన పోరాటాలు చేసిందా? అని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News