: స్వీడిష్ ఓపెన్ నుంచి తప్పుకున్న సెరెనా విలియమ్స్


అమెరికా టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ స్వీడిష్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. మోచేయికి గాయం కారణంగా ఈ టోర్నమెంట్ నుంచి వైదొలగుతున్నట్టు తెలిపింది. "మోచేతికి బంతి తగలడంతో గాయమైంది. దాంతో సమస్య ఎదుర్కొంటున్నా. గాయం పెద్దది కాకుండా చూసుకోవాలని డాక్టర్లు సూచించారు. అందుకే స్వీడిష్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నా" అని సెరెనా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల జరిగిన వింబుల్డన్ టోర్ని మహిళల సింగిల్స్ టైటిల్ ను సెరెనా గెల్చుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఇప్పటివరకు ఆమె ఆరుసార్లు ఆ టైటిల్ ను కైవసం చేసుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News