: ఓటుకు నోటు కేసులో వేం నరేందర్ రెడ్డి డ్రైవర్లకు నోటీసులు
సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ పలువురిని విచారిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో విచారించేందుకు టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి కారు డ్రైవర్లకు నోటీసులు పంపింది. సెక్షన్ 160 సీఆర్ పీసీ కింద ఇద్దరు డ్రైవర్లు విచారణకు రావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఈ రోజు ఏసీబీ విచారణకు హజరుకానున్నారు. కాగా నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్ ను ఏసీబీ రెండు రోజులు విచారించిన సంగతి తెలిసిందే.