: అమెరికా మిలటరీ కేంద్రంపై ఉగ్రదాడి... నలుగురు సైనికుల మృతి


అమెరికా మరోసారి ఉగ్రదాడితో వణికింది. టెన్నెసీలో ఉన్న మిలటరీ కేంద్రంపై మహమ్మద్ యూసఫ్ అబ్దులాజీజ్ (24) అనే ఉగ్రవాది విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నలుగురు భద్రతాదళ సిబ్బంది మరణించగా, సైన్యం జరిపిన కాల్పుల్లో అబ్దులాజీజ్ హతమయ్యాడు. ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ఘటన హృదయవిదారకమైనదని వ్యాఖ్యానించిన అధ్యక్షుడు ఒబామా, బాధితులకు సంతాపాన్ని తెలిపారు. మృతుల కుటుంబాల కోసం అమెరికన్లందరూ ప్రార్థనలు జరపాలని కోరారు. దేశంలో ఉగ్రవాద మూలాలు ఏ రూపంలో ఉన్నా ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. కాగా, సైనిక కేంద్రంలోని కాపలా సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడమే నలుగురిని బలితీసుకుందని విమర్శలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News