: దానం ఇంటిలో టీ కాంగ్ ముఖ్య నేతల భేటీ... అధిష్ఠానం ఆదేశాలపై చర్చ
గ్రేటర్ హైదరాబాదు కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ ఇంటిలో టీ కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. నేటి ఉదయం జరిగిన ఈ భేటీకి టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సికింద్రాబాదు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. నిన్న పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ఉత్తమ్ కుమార్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ భేటీలో చర్చకొచ్చిన అంశాలపై నేటి భేటీలో నేతలు సుదీర్ఘ సమాలోచనలు చేశారట.