: వినోదం కావాలంటే జేబుకు చిల్లు తప్పదంటున్న 'ఆమ్ ఆద్మీ' సర్కారు!


దేశ రాజధానిలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు మరో వివాదాస్పద నిర్ణయాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం అమలులో ఉన్న 20 శాతం వినోదపు పన్నును 40 శాతానికి పెంచింది. ఈ పెంపు సోమవారం నుంచి అమల్లోకి వచ్చేలా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం సినిమా థియేటర్లలో చూసే చిత్రాలు భారమవుతాయి. ఇంట్లో కేబుల్ కనెక్షన్ బిల్లు కూడా పెరిగిపోతుంది. డీటీహెచ్ సేవలూ దూరమవుతాయి. సినిమా టిక్కెట్ల ధరలు రూ. 20 నుంచి రూ. 40 వరకూ పెరుగుతాయని తెలుస్తోంది. కాగా, లగ్జరీ టాక్స్ ను 10 నుంచి 15 శాతానికి పెంచి ఆప్ సర్కారు ఈ నిర్ణయాన్ని వచ్చే వారం నుంచి అమల్లోకి తేనుంది. ఆప్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోంది. గత బుధవారం నాడు పెట్రోలు ధరలను తగ్గించిన వెంటనే, విలువ ఆధారిత పన్నును పెంచుతూ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో పెట్రోలు ధర తగ్గింపు ప్రయోజనం ప్రజలకు చేరలేదు.

  • Loading...

More Telugu News