: మెడలో సిలువతో పుష్కరస్నానం చేసిన జగన్... వెల్లువెత్తుతున్న విమర్శలు


వైకాపా అధినేత జగన్ చేసిన పుష్కరస్నానంపై హిందూ సంస్థలు మండిపడుతున్నాయి. గోదావరిలో మునిగే సమయంలో జగన్ మెడలో సిలువ ఉండటం పలువురి విమర్శలకు దారితీస్తోంది. క్రిస్టియన్ అయిన జగన్ పుష్కరస్నానం చేయడంలో తప్పేమీ లేకపోయినప్పటికీ, సిలువ కనబడేలా పుష్కరస్నానం చేయడం... ఇతరులపై ప్రభావం చూపే అవకాశం ఉందని హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఒక పార్టీ అధినేత అయిన జగన్ ప్రభావం ఇతరులపై ఉండే అవకాశం ఉందని అంటున్నాయి. మరోవైపు, దీనిపై ఫేస్ బుక్, ట్విట్టర్ లో కూడా అనుచిత వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకోవైపు, పుష్కరస్నానం చేసిన జగన్... మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారని ఆయన అభిమానులు అంటున్నారు.

  • Loading...

More Telugu News