: దేశంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి.... రాజకీయం చేయకండి: వెంకయ్య
కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఈరోజు కొవ్వూరు సమీపంలోని వాడపల్లి వద్ద పుష్కరస్నానం ఆచరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోటగుమ్మం పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటపై స్పందించారు. జరిగిన ఘటన బాధాకరమే అని చెప్పారు. అయితే, దేశంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయని... ఇలాంటి సున్నిత అంశాలను రాజకీయం చేయడం తగదని సూచించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు అన్ని పార్టీల నేతలు సంయమనం పాటించాలని కోరారు.