: యూనిఫాంలో ఉండి హీరోతో పోజిచ్చిన కేరళ ఐపీఎస్ అధికారిణి... చెలరేగిన వివాదం!


ఆమె తిరువనంతపురం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మెరిన్ జోసఫ్. ఎర్నాకులంలోని ఓ కాలేజీలో జరిగిన కార్యక్రమానికి అతిథిగా వెళ్లింది. ఆ కార్యక్రమానికే వచ్చిన ప్రముఖ నటుడు నవీన్ పౌలీతో కలసి ఓ ఫోటో దిగి తన ఫేస్ బుక్ ఖాతాలో పెట్టింది. దానికి వేలాది 'లైకు'లు వచ్చాయి. అంతవరకూ బాగానే వుంది. యూనిఫాం ధరించి ఓ నటుడితో ఫోటోలు దిగుతారా? అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె ప్రొటోకాల్ నిబంధనలు ఉల్లంఘించారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలన్న డిమాండూ పెరుగుతోంది. తనపై వస్తున్న విమర్శల జడివానపై మెరిన్ సైతం కాస్త ఘాటుగానే స్పందించారు. "నేను ఓ అతిథిగా వెళ్లాను. నాకేమీ అఫీషియల్ డ్యూటీలు లేవు. ఆ కార్యక్రమానికి వచ్చిన హోం మంత్రి వెళ్లిపోయారు. ఇతర అతిథులంతా కూడా వేదికను దిగారు. గెస్ట్ గా వెళ్లిన నేను కార్యక్రమం ముగిసిన తరువాత ఏం చేయాలి? ఆహూతుల ముందు నిలబడి సెల్యూట్ చేయాలా? ఇదంతా మీడియా చీప్ పబ్లిసిటీ కోసం చేస్తున్నదే. ఇందుకు నేను చింతిస్తున్నా. ప్రాధాన్యత లేని విషయాలను తెరపైకి తెచ్చి పబ్బంగడుపుకోవాలని చూస్తున్నారు. ఈ చిత్రాన్ని నేను కోరినమీదట కాంగ్రెస్ నేత హిబి ఈడెన్ తీశారు" అని ఆమె వివరించారు. కాగా, మెరిన్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారేమీ కాదు. కేరళ క్యాడర్ లో ట్రైనీ ఆఫీసరుగా చేరినప్పటి నుంచి ఆమె పలు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచారు.

  • Loading...

More Telugu News