: కొవ్వూరులో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పుష్కర స్నానం


బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గోదావరి పుష్కర స్నానమాచరించారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లి పుష్కర్ ఘాట్ కు వచ్చిన ఆయన కొద్దిసేపటి క్రితం పుష్కర స్నానం చేశారు. ఈ సందర్భంగా ఆయన గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఏపీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేటి ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన వెంకయ్య నేరుగా కొవ్వూరు చేరుకున్నారు. వచ్చీరాగానే పుష్కర స్నానం చేసిన ఆయన తదనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

  • Loading...

More Telugu News