: అంతా సాయిరెడ్డికే తెలుసు... అక్రమాస్తుల కేసులో ఈడీ ప్రశ్నలకు జగన్ జవాబు!


అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచారణాధికారుల ప్రశ్నలకు తనదైన రీతిలో బదులిచ్చారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పలు ప్రశ్నలు సంధించి జగన్ నుంచి జవాబులు రాబట్టిందట. ఆ జవాబుల్లో జగన్ ఆసక్తికర సమాధానాలిచ్చారు. తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్, పొట్లూరి వరప్రసాద్, పెన్నా ప్రతాప్ రెడ్డి తదితరులు ఎవరో కూడా తనకు తెలియదని ఆయన చెప్పుకొచ్చారు. తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన తర్వాతే వారితో తనకు పరిచయమైందని కూడా జగన్ జవాబిచ్చారు. ‘‘పొట్లూరి వరప్రసాద్ ఎవరో తెలియదు. ఒకవేళ ఉంటే ఎక్కడో పరిచయం ఉండొచ్చు. నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడుల సమయంలోనే పరిచయం. పెన్నా ప్రతాప్ రెడ్డి మా నాన్నకు పరిచయం. ఇక పెట్టుబడుల వివరాలన్నీ విజయసాయిరెడ్డికే తెలుసు. నా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారికి వారి వ్యూహాలు వారికుంటాయిగా’’ అంటూ జగన్ సమాధానమిచ్చారట.

  • Loading...

More Telugu News