: కుక్కలను స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ 'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్' హీరో భార్య


ప్రముఖ హాలీవుడ్ నటుడు, 'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్' సిరీస్ ఫేం జానీడెప్ భార్య, నటి అంబర్ హెర్డ్ కుక్కలను స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ముందస్తు అనుమతి లేకుండా రెండు వేర్వేరు జాతులకు చెందిన శునకాలను ఆమె తరలించడంతో అధికారులు స్మగ్లింగ్ కేసులు పెట్టారు. ఆస్ట్రేలియా చట్టాలకు విరుద్ధంగా శునకాలను దిగుమతి చేయడం, తప్పుడు ధ్రువీకరణ పత్రాలను చూపడం తదితర ఆరోపణలను హెర్డ్ పై మోపారు. క్వీన్ ల్యాండ్ కోర్టు ఎదుట సెప్టెంబర్ 7న హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. కాగా, ఈ ఆరోపణలు రుజువైతే అంబర్ హెర్డ్ గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షను అనుభవించాల్సి రావచ్చని, దీంతో పాటు 48 వేల అమెరికన్ డాలర్ల జరిమానా కట్టాల్సి వస్తుందని ప్రాసిక్యూటర్లు తెలిపారు.

  • Loading...

More Telugu News