: చిన్నప్పుడు నాన్న బైకు కొనివ్వలేదు... ఇప్పుడు మాత్రం బ్యాక్ సీట్ స్నేహారెడ్డిదే: అల్లు అర్జున్


తనకు చిన్నతనంలో బైకులను నడిపిన అనుభవం ఎంతమాత్రమూ లేదని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటున్నాడు. పలుమార్లు బైకు కొనివ్వాలని అడిగినా తన తండ్రి కొనివ్వలేదని చెప్పుకొచ్చాడు. 'హీరో మోటో' కొత్త బైక్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు వ్యక్తిగత విషయాలు ముచ్చటించాడు. 18 సంవత్సరాల వయసు నుంచి కార్లను వాడుతున్నానని, దీంతో బైకులను వాడే అవసరం రాలేదని చెప్పాడు. 'బన్నీ' సినిమా కోసం తొలిసారి బైకు నడిపానని, ఆపై 'హ్యాపీ' చిత్రంలో స్టంట్స్ కూడా చేశానని గుర్తుచేసుకున్న అల్లు అర్జున్ బయట ఎక్కడా డ్రైవింగ్ చేయడం లేదని అన్నాడు. సినిమాల్లో మాత్రమే హీరోయిన్లను ఎక్కించుకుని బైకులు నడుపుతున్నానని, ఒకవేళ బయట డ్రైవ్ చేయాల్సి వస్తే మాత్రం బ్యాక్ సీటు తన భార్య స్నేహారెడ్డిదేనని మురిపెంగా వివరించాడు.

  • Loading...

More Telugu News