: కాంగ్రెస్ లో ‘తెలంగాణ’కు మరింత ప్రాధాన్యం... సీడబ్ల్యూసీలో జైపాల్ కు చోటు?


కాంగ్రెస్ పార్టీలో ‘తెలంగాణ’కు మరింత ప్రాధాన్యం ఇచ్చేలా ఆ పార్టీ అధినాయకత్వం చర్యలు చేపడుతోందట. ఇప్పటికే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలుగు నేలలో ఆ పార్టీకి భారీ దెబ్బే తగిలింది. ఏపీలో పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోగా, తెలంగాణలోనూ నానాటికీ పార్టీ బలహీనపడుతోంది. రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఏపీలో ఆ పార్టీ సమీప భవిష్యత్తులో కోలుకునే అవకాశాలు దాదాపు కనిపించడం లేదు. ఇక తెలంగాణలోనైనా పట్టు సాధించాలన్న ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయంతో తెలంగాణకు చెందిన నేతలకు పార్టీలో కీలక పదవులు దక్కనున్నాయన్న వాదన వినిపిస్తోంది. పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డిని పార్టీ కీలక విభాగం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లోకి తీసుకునే దిశగా అధిష్ఠానం యోచిస్తోంది. ఇక పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ నిజామాబాదు మాజీ ఎంపీ, పార్టీ అధికార ప్రతినిధి మధు యాష్కీ గౌడ్ కు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి దక్కనుందన్న ప్రచారం సాగుతోంది.

  • Loading...

More Telugu News