: ‘నక్కీరన్’పై జయలలిత పరువు నష్టం దావా!
తన ఆరోగ్యంపై తప్పుడు కథనాలు రాసిందని ఆరోపిస్తూ తమిళనాడుకు చెందిన ‘నక్కీరన్’ పత్రికపై ఆ రాష్ట్ర సీఎం, అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత పరువు నష్టం దావా వేశారు. నిన్నటి ‘నక్కీరన్’ సంచికలో ‘‘జయలలితకు డయాలసిస్- గార్డెన్ రిపోర్ట్’ పేరిట ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై జయ భగ్గుమన్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నా, తప్పుడు కథనం రాసిన ఆ పత్రిక తన పరువు, మర్యాదలకు భంగం కలిగించిందంటూ ఆమె ఆ పిటీషన్ లో పేర్కొన్నారు.