: సమ్మె విరమించని వారిని తీసేయండి: కేసీఆర్ ఆదేశం


జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల్లో సమ్మె విరమించని వారిని తక్షణం విధుల్లోంచి తప్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ కార్మికులు, విపక్షాలు హైదరాబాదు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్పందించారు. కార్మికుల జీతాలు 47.05 శాతం పెంచుతున్నట్టు ప్రకటించారు. ఈ పెంపు గురువారం వరకు సమ్మె విరమించిన కార్మికులకు మాత్రమే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో పారిశుద్ధ్య కార్మికులకు 8,500 నుంచి 12 వేలకు, డ్రైవర్లకు 10,200 నుంచి 15 వేల రూపాయలు వేతనంగా లభించనుంది. ఈ నిర్ణయంతో 24 వేల మంది కార్మికులు లబ్ధి పొందనున్నారని అంచనా. అయితే, పెంచిన జీతాలు ఎంత మందికి వర్తించనున్నాయి? ఎంత మందిని విధుల నుంచి తప్పించనున్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, జీతాలు పెంచాలంటూ గత కొంత కాలంగా జీహెచ్ఎంసీ కార్మికులు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News