: ఆ బూట్లు కావాలంటే లక్ష కట్టాల్సిందే...ఇదో సంప్రదాయం


రాజస్థాన్ లో పంచాయతీ పెద్దల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. కుల, సంఘ, గ్రామ బహిష్కరణలు విధిస్తామంటూ గ్రామీణులను భయ భ్రాంతులకు గురి చేసి అరాచకాలకు పాల్పడుతున్నారు. రాజస్థాన్ లోని ఓ మారుమూల గ్రామంలో ఆచారం గురించి వింటే నోరెళ్ల బెట్టాల్సిందే. ఆ వూరి ఆచారం ప్రకారం గ్రామంలో ఎవరి ఇంట్లో వివాహం చేసుకోవాలనుకున్నా గ్రామపెద్దకు చెప్పాలి. అలా చెప్పకుండా వివాహం నిశ్చయిస్తే, వారిని కులం నుంచి బహిష్కరించి, వారి ఇంటి నుంచి పెళ్లి బూట్లను తెచ్చేస్తారు. పెళ్లి బూట్లను వరుడికి వధువు తరపు వారు ఇవ్వాలి. లేని పక్షంలో వరుడితో చిక్కు వచ్చిపడుతుంది. తాజాగా ఆ గ్రామంలోని ఓ రైతు తన మేనకోడలికి వివాహం నిశ్చియించాడు. ఆమెకు రెండో వివాహం కావడంతో గ్రామపెద్దకు చెప్పకుండా తంతు పూర్తి చేద్దామని భావించాడు. దీంతో గ్రామపెద్దలు వచ్చి పంచాయతీకి రమ్మని ఆర్డరేసి, బూట్లు పట్టుకెళ్లిపోయారు. పంచాయతీకి వెళ్లాక బూట్లు కావాలంటే లక్ష రూపాయలు పంచాయతీకి కట్టాలని ఆదేశించారు. దీంతో ఏం చేయాలో తోచక రైతు తలపట్టుకున్నాడు.

  • Loading...

More Telugu News