: మోదీజీ, షరీఫ్ జీ! నా సినిమా చూడండి: భారత్, పాక్ ప్రధానులకు సల్మాన్ పిలుపు
తన తాజా సినిమా 'భజరంగీ భాయ్ జాన్'ను చూడాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు సల్మాన్ ఖాన్ పిలుపునిచ్చాడు. రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న తన 'భజరంగీ భాయ్ జాన్' సినిమాను వీక్షించాలని ఇరు దేశాల ప్రధానులను సల్లూ భాయ్ ట్విట్టర్ ద్వారా కోరాడు. భారత్, పాకిస్థాన్ నేపథ్యంలో తెరకెక్కిన 'భజరంగీ భాయ్' జాన్ సినిమాను ఇరు దేశాల ప్రధానులు వీక్షించడం గర్వంగా ఉంటుందని సల్లూభాయ్ తెలిపాడు. పాకిస్థాన్ కు చెందిన బాలికను స్వదేశం చేర్చేందుకు భారతీయ యువకుడు భజరంగీ చేసిన ప్రయత్నమే ఈ సినిమా అన్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ జంటగా తెరకెక్కిన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో విడుదల చేయనున్నారు. కాగా, ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? చూద్దామా? అని అమీర్ ఖాన్ వంటి బాలీవుడ్ నటీనటులు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.